Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలి

- Advertisement -
- Advertisement -
  • 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి

ఖిల్లా వరంగల్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం డివిజన్‌లోని బూత్ కన్వీనర్లు కష్టపడి పనిచేయాలని 40వ డివిజన్ కార్పోరేటర్ మరుపల్ల రవి అన్నారు. గురువారం డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్ అధ్యక్షతన ఉర్సు ప్రతాప్‌నగర్‌లో జరిగిన బూత్ కన్వీనర్ల సమావేశానికి ముఖ్యఅతిథిగా రవి హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేంరద్ చేపడుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. డివిజన్‌లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందచేలా నా దృష్టికి తీసుకవస్తే వారికి న్యాయం జరగడానికి ఎమ్మెల్యే నరేందర్, అధికారుల దృష్టికి తీసుకవస్తానన్నారు. ఎమ్మెల్యే చొరవతో కోట్లాది రూపాయాల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు పూజారి విజయ్, కార్యదర్శి వనం కుమార్, బూత్ కన్వీనర్లు వనం మధు, కోరె కృష్ణ, మరుపల్ల గౌతమ్, ఓగిలిశెట్టి సంజీవ్, బైరగోని మనోహర్, వంగరి సురేష్, ఎండీ సలీమ్, గజ్జి సాంబయ్య, వెంగల రాంనర్సు, శెట్టి మోహన్, అంకం దేవానంద్, కుండె కుమార్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News