Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్‌ది ప్రజల టీమ్

- Advertisement -
- Advertisement -

మన : బిఆర్‌ఎస్ పార్టీది ప్రజల టీం.. రైతులు, మహిళలు, యువకులు, పీడితుల టీం అని ఆ పార్టీ నాయకులు, రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలోనే మహారాష్ట్రలోని సోలాపూర్‌లో బిఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. అందులో భాగంగా సభ నిర్వహణ కోసం బాల్కోటి మైదానం, ఈ ద్గా మైదానాలను మంత్రులు హరీశ్‌రావు, మహముద్ అలీ, ఎంఎల్‌సి ఎల్. రమణ, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ ఇంఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్‌రావు, జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పరిశీలించారు. సోలాపూర్‌లో పద్మశాలీల ఆరాధ్య దైవం మార్కండేయ రథోత్సవ కార్యక్రమానికి అక్కడి పద్మశాలీ నేతల ఆహ్వానం మేరకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బృందం బిఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం హాజరయ్యింది.

ఈ బృందంలో మంత్రి మహమూద్ అలీ, ఎంఎల్‌సి ఎల్.రమణ, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ ఇన్‌చార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు, బిఆర్‌ఎస్ నా యకులు బొంతు రామ్మోహన్ ఉన్నారు. సోలాపూర్‌లో పద్మాశాలీ నేతలు బిఆర్‌ఎస్ ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. సోలాపూర్ మార్కండేయ రథయాత్రలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కండేయ ఆలయంలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, తెలంగాణలో రైతులకు అందుతున్న సకల సౌకర్యాలను చూసి అటువంటి విధానాలు తమకూ కావాలని మహారాష్ట్ర రైతులు బిఆర్‌ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.

మహారాష్ట్రలో తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తాం
మహారాష్ట్ర సర్కార్ తెలంగాణ మోడల్‌ను అమలు చేయకపోతే త్వరలో అక్కడ ఏర్పడే బిఆర్‌ఎస్ సర్కారే నూటికి నూరుపాళ్లు తెలంగాణ మోడల్‌ను అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. 14 ఏండ్లు సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ఇవ్వాళ దేశానికే మార్గదర్శనం చేసే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు ఏయే టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. రైతులపై మహారాష్ట్ర సర్కార్‌కు నిజమైన ప్రేమ ఉంటే ముందుగా రైతు ఆత్మహత్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పద్మశాలీయుల ఆరాధ్యదైవం మార్కండేయ ఆలయ అభివృద్ధికి బిఆర్‌ఎస్ పార్టీ తోడ్పాటును అందిస్తుని మంత్రి చెప్పారు.

సోలాపూర్‌లో రాఖీపౌర్ణమిని పురష్కరించుకొని మార్కండేయ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు నిర్వాహకులు తమను ఆహ్వానించటమే కాకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరిన నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కెసిఆర్ కోటి రూపాయల విరాళం ప్రకటించారని చెప్పారు. 100 ఏండ్లుగా కొనసాగుతున్న మార్కండేయ రథోత్సవంలో పాల్గొనడం తమకు గొప్ప అనుభూతిని కలిగించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోలాపూర్‌లో వచ్చి స్థిరపడిన తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి ఉంటూ ఐక్యతను చాటుకోవాలని కోరారు. సోలాపూర్ అక్కచెల్లెళ్లకు హరీశ్‌రావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News