Monday, December 23, 2024

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాదే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కల్లూరు : ఎవరెన్ని ట్రిక్కులు కొట్టినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికల్లో మరోసారి గెలిచి విజయపతాకాన్ని ఎగరేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సత్తుపల్లి ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు, ఎన్‌ఎస్‌పి కార్యాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ బలమేంటో, బిఆర్‌ఎస్ శక్తి ఏంటో కల్లూరు ప్రజలు నిరూపించారన్నారు. ఇంత ఎండలో సైతం పార్టీ మీద మక్కువతో కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథకాలలో ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో కల్లూరు పట్టణ ప్రజలు నిరూపించారని, ఇదే నిదర్శనం గా రానున్న ఎన్నికల్లో సిఎం కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు. కల్లూరు మీటింగ్‌లో ఉన్న సగం మం ది కూడా అమిత్ షా మీటింగ్‌లో లేరన్నారు. ఖమ్మం జి ల్లాలో బిజెపికి డిపాజిట్ వస్తుందా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా.. నిజం చెప్పకుంటే అబద్ధాలు ప్రచారం అవుతాయన్నారు.

మీరంతా ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని, వాటికి ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. యాసంగి పంట 2014లో 14 లక్షల ఎకరాలు పండితే, నేడు 56 లక్షల ఎకరాల్లో పంట పండిందన్నారు. 2014లో 3600 కోట్లు పంట కొ నుగోళ్లు చేస్తే, గతేడాది 26,600 కోట్లు కొనుగోలు చేశాం అన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతున్నదో.. ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే అంత పంట పండుతున్న ది, కరువు అనే పదాన్ని కెసిఆర్ డిక్షనరీ నుంచి తొలగించారన్నారు. అకాల వర్షాలకు రైతులు అధైర్య పడొద్దని, రైతు ప్రభుత్వం మనదేనని, రైతు నాయకుడు కెసిఆర్ అ ని అన్నారు. మొన్న పంట నష్టపోతే ఎకరాకు రూ.10 వే లు ప్రకటించారని, ఇప్పుడు కూడా అకాల వర్షాల వల్ల న ష్టపోయిన రైతులకు కెసిఆర్ అండగా ఉన్నారన్నారు. కెసిఆర్ రైతు విలువ పెంచారు కాబట్టి, భూముల విలువ పెం చారన్నారు. కర్ణాటకలో ఓటమి తప్పదు అనే ఫ్రస్టేషన్‌లో అమిత్ షా ఉన్నారన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పె ట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిన్న వచ్చి ఏం చెప్పార ని, 1350 కోట్లు హక్కుగా రావాల్సిన దాని గురించి చె ప్పారా..? బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి చెప్పాడా.? జాతీయ ప్రాజెక్టు గురించి చెప్పారా..? అని అన్నారు.

కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏముందని, రైతులకు కరెంట్, ఎ రువులు ఇవ్వలేదని, ఏం ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తారన్నారు. హామీ ఇవ్వకుండా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కెసిఆర్ ప్రజల కోసం పో రాటం చేశారన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన కం టి వెలుగు విజయ వంతంగా కొనసాగుతున్నదని, ఇప్పటికే 1.17 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశామని, మొ త్తం రెండు కోట్ల మందికి చేస్తాం అని అన్నారు. సీతారా మ ప్రాజెక్టు నీళ్ళు మూడు నాలుగు నెలల్లో ఖమ్మంలో ప్ర తి మండలానికి తెస్తాం అని మంత్రి అన్నారు. రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథరెడ్డి మాట్లాడుతూ కల్లూరు ప ట్టణ ప్రజలకు కోటి రూపాయలతో నూతన బస్టాండ్ ని ర్మాణాన్ని, వచ్చే నెలలో కల్లూరు మండలంలో ఉన్న నిరుద్యోగులకు సుమారు 100 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా తన కంపెనీలో అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తానని సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లప్పుడూ నేను ఉం టానన్నారు.

ఎంపి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలలో 1,350 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావా ల్సి ఉండగా కాకి లెక్కలు చెబుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు గుణపాఠం చెప్పే తరుణం ఆసన్నమైనదని, ఫైనాన్స్ మినిస్టర్ స్వయంగా తెలంగాణ ప్రభుత్వానికి 1350 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని అటువంటి లెటర్‌ను స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి అందించారని, కానీ కొంతమంది బొంకు మాటలు చెబు తూ కాలం గడుపుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు అటువంటి మాటలు నమ్మే స్థితిలో లేరని ఎంపి నామా నాగేశ్వరరావు అన్నారు. ఎంపి వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ కల్లూరు ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలు ఇంత గొప్పగా హాజరై పా ర్టీ ఒక్క గొప్పతనాన్ని మహిళా లోకాన్ని తమ స్వరాన్ని వి నిపించేలా ఈ సభలో పాల్గొనడం ఎంతో గర్వకారణం వ ద్దిరాజు అన్నారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అతి త్వరలో గోదావరి జలాలు సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి నియోజకవర్గానికి పుష్కలమైన నీరు లభిస్తుందని, ఇక రెండు పంటలకు కొదువు లేకుం డా పుష్కలంగా పంటలు పండుతాయని, నా కల నెరవేరుతుందని తుమ్మల అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డిసిఎస్ ఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, కల్లూరు సర్పంచ్ లక్కినేని నీరజా రఘు, ఎంపిపి బీరవల్లి రఘు, జడ్పిటిసి కట్ట అజయ్ కుమార్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, కల్లూరు సొసైటీ చైర్మన్ బి.లక్ష్మణరావు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ లక్కినేని రఘు, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు పసుమర్తి చందర్రావు, బిఆర్‌ఎస్ పార్టీ మండల కార్యదర్శి కొరకప్పు ప్రసాద్, కల్లూరు మండలంలోని సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు, టిఆర్‌ఎస్ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News