Sunday, December 22, 2024

రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌దే విజయం

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకోసం కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మొండితోక సుధాకర్ రావు కార్యకర్తలను కోరారు. ఎర్రుపాలెం మండలం సఖినవీడు గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణను కలిసి పార్టీ పరిస్థితులపై చర్చించారు. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని అన్నారు. 2014 నుంచి మధిర నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు.

ఎర్రుపాలెం మండలంలో చావా రామకృష్ణ, పంబి సాంబ శివరావులు పార్టీకోసం పటిష్టంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా మధిర మండలం దెందుకూరు సొసైటీ చైర్మన్ కోట వెంకటకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి మరోసారి పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు. పార్టీ కోసం వర్గవిభేదాలు లేకుండా కష్టపడి పని చేయాలని ఒకవేళ పొరపాట్లు ఉంటే జిల్లా నాయకత్వంతో మాట్లాడి సరిచేసుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News