Monday, December 23, 2024

ఎన్నికలకు బీ రెడీ

- Advertisement -
- Advertisement -
బిఆర్‌ఎస్ కార్పొరేటర్‌లతో మంత్రి కెటిఆర్ సమావేశం

హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ (బిఆర్‌ఎస్) విజయం ఖాయమని, దీనికోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీన బిఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో మంత్రి కెటిఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంభీపూర్ రాజు, మేయర్ విజయలక్ష్మి ఇతర సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ పార్టీ, ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కెటిఆర్ సూచించారు. పార్టీ తరఫున నిర్వహించే సమావేశాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని, పార్టీ బలోపేతం ద్వారా మనం మరోసారి రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తామన్నారు.

రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విజయం తథ్యమని మంత్రి కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల సారథ్యంలో వార్డుల్లో పార్టీని ఎన్నికలకు సమయత్తం చేయాలన్నారు. రానున్న సంవత్సర కాలం పాటు పార్టీ కార్యకలాపాలు విస్తృ తంగా ఉంటాయని కెటిఆర్ పేర్కొన్నారు. వాటిని విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కార్పొరేటర్లకు మంత్రి కెటిఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్న తీరును ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని కెటిఆర్ వారికి మార్గనిర్ధేశనం చేశారు.

జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం
16వ తేదీన ప్రారంభించే జిహెచ్‌ఎంసి వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ వారితో మమేకమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ దశాబ్ధి ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వార్డు కార్యాలయాల ప్రారంభిస్తున్నామని, వీటి ద్వారా నగరంలో సుపపాలన మరింత బలోపేతం అవుతుందన్నారు. వార్డు కార్యాలయ వ్యవస్థపై అవగాహన కోసం జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం కార్పొరేటర్ల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. వార్డు కార్యాలయ ప్రారంభోత్సవాల్లో భాగంగా తమ పరిధిలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వార్డులోని ప్రముఖ వ్యక్తులు, సంఘాలను కలుపుకుపోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్పొరేటర్లు ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళుతూనే పార్టీ బలోపేతం కోసం పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సూచించారు.

వార్డు కార్యాలయాల ఏర్పాటుతో నగర ప్రజలకు మరిన్ని సేవలు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వేగంగా అందించాలన్న ఉద్ధేశ్యంతో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలను చేపట్టారని కెటిఆర్ తెలిపారు. ఈ ఆలోచన దృక్పథంలోంచి జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ఇంటి ముందట నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇదే వికేంద్రీకరణ స్ఫూర్తితో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేస్తున్న వార్డు కార్యాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని కెటిఆర్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News