Monday, December 23, 2024

బండి పై భగ్గు…

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో : ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నగర బిఆర్‌ఎస్ నేతలు భగ్గుమన్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేశారు. మహిళ నేతల అందోళనతో రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడి విచారణను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఈడి కార్యాలయం వద్ద బిఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు నిర్వహించగా, కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యాలను నిరసిస్తూ రాజ్ భవన్ వద్ద జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నేతృత్వంలో కార్పోరేటర్లు, ప్రభుత్వ విప్ గొంగడి సునీత ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ మహిళ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఖైరతాబాద్ చౌరస్తా పిజెర్ విగ్రహాం నుంచి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ విప్ గొంగడి సునీతతోపాటు కార్పోరేటర్లు, మహిళా నేతలు రాజ్ భవన్‌కు ర్యాలీగా వెళ్లారు.

అయితే గవర్నర్ నుంచి తమకు ఏలాంటి ఆదేశాలు లేవంటూ పోలీసులు మేయర్ బృందానికి అనుమతి నిరాకరించడంతో వారంత అక్కడే రోడ్డుపై భైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో బ్యారికెట్లు తోసుకుని రాజ్‌భవన్‌లోకి చోచ్చుకువెళ్లేందుకు మేయర్ విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు యత్నించడంతో పోలీసులు వారి అడ్డుకున్నారు. దీంతో మేయర్ పోలీసులతో వాగ్వివాదానికి దిగ్గారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యాలు చేసిన వ్యక్తిపై పిర్యాదు చేసేందుకు మహిళా గవర్నర్ కలిసేందుకు వస్తే అనుమతించపోవడం ఏమిటాని, తామంతా ప్రజా ప్రతినిధులమని, ఎందుకు అనుమతించరంటూ నిలదీశారు. అయితే అనుమతికి సంబంధించి గవర్నర్ నుంచి తమకు ఏలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పోలీసులు స్పష్టంచేయడంతో గవర్నర్‌కు, బండి సంజయ్‌తో పాటు బిజెపికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాజ్‌భవన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

అయినా గవర్నర్ తమిళ సౌ సౌందర్ రాజన్ అపాయింట్మెట్ లభించకపోవడంతో గవర్నర్ తీరును నిరసిస్తూ రాజ్‌భవన్‌నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహారం వరకు నిరసన ర్యాలీగా తరలి వచ్చారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు కార్పొరేటర్లు మన్నే కవితా రెడ్డి, బొంతు శ్రీదేవి, సామల హేమతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు వినతి పత్రం సమర్పించారు.
బండి సంజయ్ మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందే ః మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఎమ్మెల్సీ కె.కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యాలు పట్ల జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మండి పడ్డారు. వెంటనే ఆయనను తీవ్రంగా ఖండిస్తున్నామని, మహళందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ పార్టీకి అధ్యక్షులుగా ఉండి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన నోరును ఫినాయిల్‌తో కడగాలంటూ తీవ్రంగా విరుచుపడ్డారు. ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లితే గవర్నర్ ఓ మహిళా అయి ఉండి కూడా ఉదయం నుంచి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. గవర్నర్‌పై తమ నాయకుడు చేసిన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణలు చెప్పామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News