Monday, December 23, 2024

బషీర్‌బాగ్‌లో ఇడి కార్యాలయం వద్ద బిఆర్‌ఎస్ కార్యకర్తల ధర్నా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ మద్యంకేసులో కవితను ఇడి విచారిస్తున్న నేపథ్యంలో బషీర్‌బాగ్‌లో ఇడి కార్యాలయం ముందు బిఆర్‌ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పలుచోట్ల దిష్టి బొమ్మలను బిఆర్‌ఎస్ శ్రేణులు దగ్ధం చేశాయి. బషీర్‌బాగ్‌లోని ఇడి కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. ఢిల్లీలో కవితను ఇడి విచారిస్తున్న నేపథ్యంలో ఇడి కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేశారు. బసీర్‌బాగ్ ఇడి కార్యాలయం గేట్లు పోలీసులు మూసివేశారు.

పంజాగుట్టలో ఎంఎల్‌సి కవితపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.ఎంఎల్‌ఎ దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ధర్నా చేపట్టారు. బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కవితకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News