Friday, December 20, 2024

ఆ హామీలను అమలు చేయకపోతే వదిలిపెట్టం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కెసిఆర్ కంటే పదునైన గొంతు దేశంలో లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలికేవన్ని ప్రగల్భాలేనని కెటిఆర్ చెప్పారు. కాలం కలిసివస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలుకోడతాయని శాస్త్రం చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమత్రి కాదని… ఢిల్లీ మేనేజ్ మెంట్ కోటా ముఖ్యమంత్రి అన్నారు.

కెసిఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా?.. తెలంగాణ రాకుంటే సిఎం, డిప్యూటీ సిఎం పదవులు మీకు దక్కేనా? అని ప్రశ్నించారు. హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ అల్లుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ అవినీతి.. అక్కడ అవినీతి అని కథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది.. అవినీతిని వెలికితీయమనే చెబుతున్నామని డిమాండ్ చేశారు. అవినీతి జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోండన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటే వదిలిపెట్టమని కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News