Wednesday, January 22, 2025

మళ్లీ సారు… కారే

- Advertisement -
- Advertisement -

గులాబీ పార్టీకి 44.62 శాతం అనుకూలత
కాంగ్రెస్ 32.71 శాతం, బిజెపి 17.6 శాతం
మిషన్ చాణక్య సర్వే రిపోర్ట్‌లో వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికారం మళ్లీ బిఆర్‌ఎస్ పార్టీదేనని మిషన్ చాణక్య సర్వే రిపోర్టు తేల్చింది. ఓట్ షేర్‌పై మిషన్ చాణక్య నిర్వహించిన సర్వేలో బిఆర్‌ఎస్ 44.62 శాతం, కాంగ్రెస్ 32.71 శాతం, బిజెపి 17.6 శాతం, ఇతరులకు 5.04 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. అన్ని వయసుల ఓటర్లలోనూ అధిక శాతం మంది బిఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. గత నాలుగు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 117 అసెంబ్లీ స్థానాల్లో విస్తృత ప్రత్యేక పరిశోధన నిర్వహించి విస్తృతంగా అధ్యయం చేసి.. 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించిన అనంతరం మిషన్ చాణక్య సర్వే ఈ డాటాను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో మళ్లీ అధికారం భారత రాష్ట్ర సమితిదే అని తేల్చిచెప్పింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై 85 శాతం ప్రజల సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది. గత ప్రభుత్వ కాంగ్రెస్ హయాంలో ఇది కేవలం 44 శాతమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్‌ఎస్ పార్టీకి అత్యధిక శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు ప్రజలు మళ్లీ పట్టం కడతారని సర్వే తెలిపిదింది.
గులాబీ పార్టీకే మహిళల మొగ్గు
బిఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత మహిళా ఓటర్ల నుంచి భారీగా సానుకూల స్పందన పెరిగిందని సర్వే తేల్చింది. బిఆర్‌ఎస్‌కు మొత్తం 44.62 శాతం అనుకూలంగా ఉండగా, అఅందులో 38.91 శాతం పురుషులు, 50.32 శాతం మహిళలు అనుకూలంగా ఉన్నారు.అలాగే కాంగ్రెస్‌కు 32.71 శాతం అనుకూలంగా ఉండగా, అందులో 33.76 శాతం పురుషులు, 31.65 శాతం మహిళలు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది.బిజెపికి కేవలం 17.60 శాతం అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
సామాజికవర్గాలవారీగా బిఆర్‌ఎస్‌కే మెజార్టీ ప్రజల మద్దతు
రాష్ట్రంలో సామాజికవర్గాలవారీగా మెజార్టీ ప్రజలు గులాబీ పార్టీకే మొగ్గుచూపారు. మొత్తం 44.62 శాతంలో 45.97 శాతం బిసిలు, 41.20 శాతం ఒసిలు, 43.17 శాతం ఎస్‌సిలు, 44.45 శాతం ఎస్‌టిలు, 48.31 శాతం మైనార్టీలు బిఆర్‌ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. అదే కాంగ్రెస్‌కు 26.70 శాతం బిసిలు, 29.62 శాతం ఒసిలు, 33.67 శాతం ఎస్‌సిలు, 36.41 శాతం ఎస్‌టిలు, 36.41 శాతం మైనార్టీలు అనుకూలత వ్యక్తం చేయగా, బిజెపికి 24.60 శాతం బిసిలు, 24.89 శాతం ఒసిలు, 16.60 శాతం ఎస్‌సిలు, 16.41 శాతం ఎస్‌టిలు, 5.52 శాతం మైనార్టీలు సానుకూలత వ్యక్తం చేసినట్లు మిషన్ చాణక్య సర్వే తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News