Sunday, December 22, 2024

నేడు బిఆర్‌ఎస్‌వి విద్యార్థి ప్రతినిధుల సమావేశం

- Advertisement -
- Advertisement -

ముఖ్య అతిథిగా మంత్రి కెటిఆర్ హాజరు

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ విజయం కోసం ఆపార్టీ విద్యార్ది విభాగం ప్రచారానికి సిద్దమవుతోంది. నేడు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర కమిటీ, జిల్లా కోఆర్డినేటర్స్, నియోజకవర్గ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆసంఘం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ హాజరైతున్నట్లు తెలిపారు. సమావేశానికి రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కోఆర్డినేటర్‌లు, నియోజకవర్గం ప్రతినిధులు, నియోజకవర్గ స్థాయీ ముఖ్యులు హాజరు కావాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News