Friday, November 22, 2024

మంచినీళ్లే బ్రూస్‌లీ మరణానికి కారణమా?

- Advertisement -
- Advertisement -

 

మార్షల్ ఆర్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన హాలీవుడ్ హీరోగా బ్రూస్‌లీ చరిత్రలో నిలిచిపోతాడు. ఎంటర్ ది డ్రాగన్ సినిమాతో ప్రపంచ సినీ ప్రియుల ఆరాధ్య నటుడిగా మారిపోయిన బ్రూస్‌లీ చాలా చిన్న వయసులోనే అంతుపట్టని వ్యాధితో మరణించాడు. 1973 జూలై 20న హఠాత్తుగా కన్నుమూసిన బ్రూస్‌లీ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే..అధికంగా మంచినీళ్లు తాగడం వల్లే బ్రూస్‌లీ మరణించి ఉండవచ్చని క్లినికల్ కిడ్నీ జర్నల్ తాజాగా వెల్లడించింది. అధికంగా మంచినీరు తాగడం వల్ల రక్తంలో సోడియం లెవల్స్ పడిపోయి హైపోనాట్రిమియా అనే వ్యాధితో బ్రూస్‌లీ మరణించి ఉండవచ్చని ఈ జర్నల్ భావిస్తోంది.

బ్రూస్‌లీ మరణించినపుడు అనేక పుకార్లు షికారు చేశాయి. ఆయనకు విషం పెట్టి చంపేశారని, ఆయనను గ్యాంగ్‌స్టర్లు చంపేశారని..ఇలా పరు రకాల వదంతులు వినిపించాయి. అయితే..బ్రూస్‌లీ పోస్ట్‌మార్టమ్ నివేదికను ఆధారం చేసుకుని జరిగిన వైద్య పరిశోధనలో కొన్ని ఆసక్తికర వాస్తవాలు బయటపడ్డాయని ఈ జర్నల్ పేర్కొంది. బ్రూస్‌లీ భార్య లిండా చెప్పిన ప్రకారం చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు తనకు తలనొప్పిగా, కళ్లు తిరుగుతున్నట్లు ఉందని చెప్పిన బ్రూస్‌లీ కొద్దిగా నీళ్లు తాగాడు. అంతేగాక తన భర్త ఘన ఆహారం తీసుకోవడం చాలా రోజుల నుంచి మానేశాడని, కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకునేవాడని లిండా చెప్పారు.

ఐఎఫ్‌ఎల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక పరిశోధన నివేదిక ప్రకారం చనిపోయిన రోజున బ్రూస్‌లీ మాదకద్రవ్యాలను తీసుకున్నాడు. అతని మెదడు అసాధారణంగా 1,575 గ్రాముల బరువుందని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొన్నట్లు జర్నల్ తెలిపింది. హైపోనాట్రిమియా వల్లే అతను మరణించి ఉంటాడని, అతని కిడ్నీ కూడా పనిచేయకపోయి ఉండవచ్చని జర్నల్ తెలిపింది. తీవ్ర వాంతులు, విరేచనాలు, అతిసారం వంటివి కూడా హైపోనాట్రిమియా పరిస్థితికి దారితీస్తాయని, దీంతో రక్తంలో సోడియం లెవల్స్ పడిపోతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News