Thursday, January 23, 2025

విపక్ష పాలిత రాష్ట్రాలో కోకొల్లలుగా

- Advertisement -
- Advertisement -

మహిళలపై అమానుష దాడులు
అవి వారికి కనిపించలేదా అని బిజెపి ఎదురు దాడి

న్యూఢిల్లీ: రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోను మహిళలపై అమానుష దాడులకు సంబంధించి అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయని, అయితే మణిపూర్‌లో జరిగిన ఘటనపై మాత్రమే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బిజెపి ఆరోపించింది. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికి రాజస్థాన్,బీహార్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నమోదయిన కేసులను ప్రస్తావించారు.

Also Read: మృత్యుంజయుడు ఆ జెసిబి డ్రైవర్(వైరల్ వీడియో)

‘ రాజస్థాన్‌లో గత నాలుగేళ్ల కాలంలో లక్షకు పైగా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో మహిళలపై లైంగిక దాడులకు సంబంధించే 33 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి’ అని ఠాకూర్ చెప్పారు. రాజస్థానఃలో మంత్రి రాజేంద్ర గుఢాను మంత్రివర్గంనుంచి తొలగించడంపై మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రిని సోనియాగాంధీ, రాహుల్ గాంధీల ఆదేశాలతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తొలగించారని కేంద్ర మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News