Monday, December 23, 2024

వ్యక్తిని నీటిలో ముంచి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

 

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకిటి వెంకటయ్య (52) తెల్లవారుజామున తన ఇంటి సమీపంలోని చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లగా..అదే గ్రామానికి చెందిన అతని బావమరిది వనం సైదులు, అతని కుమారులు నాగరాజు, గోపి దాడి చేసి నీటిలో ముంచి హత్య చేశారని సీఐ ఎ.వెంకటయ్య తెలిపారు. మృతుడి మెడపై కమిలిన, వంటిపై పెట్రోల్‌ చల్లినట్లు గుర్తులు ఉండటంతో పథకం ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ పాత కక్షలు, భూ వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు కారణాలతో పాటు మంత్రాల అనుమానం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది.

మృతుడి కుమారుడు ఆకిటి సైదులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుని కుటుంబీకులు, బంధువుల ఆందోళన మధ్య వెంకటయ్య మృతదేహాన్ని శవపరీక్ష కోసం నకిరేకల్‌ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని కుటుంబీకులు నిందితుల ఇంటికి నిప్పంటించేందుకు యత్నించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న వారిని అదుపుచేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News