Thursday, December 26, 2024

చిన్నరాస్పల్లిలో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

దహెగాం : దహెగాం మండలంలోని చిన్నరాస్పల్లి గ్రామంలో వెల్ములె పుల్లయ్య (43) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు తెలిపారు.సంఘటన స్థలంను ఆదివారం కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు,దహెగాం ఎస్‌ఐ సనత్ రెడ్డి పరిశీలించారు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం పుల్లయ్య తరుచూ తన భార్యతో గోడవ పడుతు ఉండేవాడని ఇదివరకు స్థానికంగా పంచాయతీలు కూడా జరిగినట్లు తెలిపారు.

పుల్లయ్య అన్న హన్మంతు ఆదివారం ఉదయం పుల్లయ్య ఇంటికి వెళ్ళగా తలకు తీవ్రంగా గాయంతో చనిపోయి పడి ఉన్నట్లు, పుల్లయ్య భార్య, చిన్నబిడ్డ కనబడటం లేదని హన్మంతు తెలిపినట్లు సీఐ తెలి పారు. పుల్లయ్యకు భార్య మంగ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం అయింది.

పుల్లయ్య అన్న హన్మంతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన తమ్ముడు పుల్లయ్య మృతికి పుల్లయ్య భార్య మంగ, చిన్న కూతురు కారణం అనే అనూమానంతో హన్మం తు ఫిర్యాదు చేశారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పుల్లయ్యబార్య,బిడ్డ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News