Sunday, January 12, 2025

పట్టపగలు రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో సోమవారం పట్ట పగలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ ఫ్రూట్ మార్కెట్ సమీపంలోని ఓ హోటల్‌లో టీ తాగుతున్న మహ్మద్ మక్సూద్ (40)ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

హత్యకు గురైన మక్సూద్ పట్టణంలోని వతన్ బాగ్‌లో నివాసమంటూ జులరీ షాప్ నడుపుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. హోటల్‌లో జరిగిన హత్య విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మక్సూద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News