Thursday, January 23, 2025

రాజేంద్రనగర్ లో రౌడీషీటర్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలలోకి వెళితే.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సర్వర్ (35) రౌడీషీటర్. ప్రత్యర్థులు అతన్ని మట్టు బెట్టాలని పథకం ప్రకారం మధ్యవర్తులతో మాట్లాడుకుందామని పిలిపించారు. దాంతో మధ్యవర్తుల మాటలు నమ్మిన సర్వర్ వారు చెప్పిన విధంగా డైరీఫాం వెనుక వైపు ఉన్న నిర్మానుష ప్రాంతానికి వచ్చాడు. రాజీ కుదుర్చే ప్రయత్నంలో ప్రత్యర్థులతో మాటామాట పెరిగింది. దాంతో పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తులతో ప్రత్యర్థులు సర్వర్‌ను దారుణంగా పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పాత కక్షలే హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News