Tuesday, December 24, 2024

యువకుడి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లిలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన ఉమర్ అనే యువకుడు ఉమర్ అనే యువకుడు జులాయిగా తిరుగుతుంటాడని వివరించారు. శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఉమర్ తల్లి మామిడి కాయలను ముక్కలుగా కొట్టించుకుని రమ్మంటే కాయలు తీసుకుని ఇంటి నుంచి భయటకు వెళ్లాడు. మహబూబాబాద్‌కు వెళ్లిన ఉమర్ సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో అతని తల్లి పలు మార్లు ఫోన్ చేసింది. రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి చేరుకున్న ఉమర్ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఘర్షణ పడ్డాడు.

ఇంట్లో గొడవ పెట్టుకుని తిరిగి భయటకు వెళ్లిన ఉమర్ తిరిగి ఇంటికి రాలేదు. కాగా అర్థరాత్రి దాటక గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులో ఉమర్‌ను దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని ఇంటి ముందు వదిలి వెళ్లారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. గ్రామస్తులు మహబూబాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమాదు చేసుకుని మృతదేహాన్ని  జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రూరల్ సీఐ రమేష్ ఉమర్ హత్య కేసుగా నమోదు చేసుకుని హత్యకు దారితీసిన సంఘటనలు, హత్యకు పాల్పడిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వివరించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News