Saturday, December 28, 2024

ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/జైపూర్‌: ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే నెపంతో మహేష్ అనే యువకున్ని యువతీ కుటుంబ సభ్యులు అతి దారుణంగా హత్య చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో మంగళవారం చోటు చేసుకుంది. ఉదయం పూట తన పాల వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న మహేష్(25)అనే యువకున్ని మాటు వేసి అడ్డగించి దాడి చేసి హత్య చేశారు. అందరు చూస్తుండగానే ఈ సంఘటన జరిగినప్పటికి ఎవరు ఆపేందుకు ముందుకు రాకపోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన పెద్దపెల్లి శృతి, మహేష్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, వీరి ప్రేమ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో సీసీసీకి చెందిన శివ అనే యువకునితో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు.

ఇదే క్రమంలో పెళ్ళి అయిన తర్వాత శృతికి అసభ్య మెసేజ్‌లు, గతంలో మాట్లాడిన చాటింగ్ మెసేజ్‌లు భర్త శివకు పెట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడని, దీంతో కుటుంబ సభ్యులు జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా, రిమాండ్‌లో ఉండి ఇటివలే ఇంటికి వచ్చాడని, ఇదే క్రమంలో కుటుంబ సభ్యులు మహేష్‌పై కక్ష కట్టి మంగళవారం ఉదయం తన వాహనంపై పాలు పోసి ఇంటికి తిరిగి వస్తుండగా, శృతి కుటుంబ సభ్యులు పెద్దపెల్లి కనకయ్యతో పాటు మరో నలుగురు మహేష్‌ను దారుణంగా హత్య చేశారు. సంఘటన జరిగిన వెంటనే ఏసీపీ నరేందర్, సీఐ రాజు, ఎస్సై రామకృష్ణ అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మృతుని బంధువుల ధర్నా…

తమ కుమారున్ని అతి కిరాతకంగా చంపిన కనకయ్య కుటుంబంపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు మృతదేహంతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. హత్య చేసిన వారిని తమకు అప్పగించాలంటూ మృతుని బంధువులు ధర్నాకు దిగారు. మృతుని తల్లి రాజేశ్వరి తమ కుమారునికి మృతికి కారణం శృతియే అని, హత్య చేసిన కనకయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News