Thursday, January 23, 2025

వసతి గృహంలో విద్యార్ధి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలుర వసతి గృహంలో నిద్రిస్తున్న విద్యార్ధి దారుణ హత్యకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోగుల శ్రీనివాస్ రెడ్డి,రామలక్ష్మి దంపతులు మన్యంలోని ఉర్రింకలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు అఖిల్ రెడ్డి ఏలూరు జిల్లా బుట్టాయిగూడం మండలం పులిరాముడు గూడెంలోని గిరిజన సాంఘిక వసతి గృహంలో 4వ తరగతి చదువుతున్నాడు.

Also Read: ఎనిమిది మందిని పెళ్లాడిన యువతి..ఆర్వాత

సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు వసతి గృహంలోకి ప్రవేశించి నిద్రిస్తున్న అఖిల్ రెడ్డిని బయటకు ఎత్తుకెళ్లారు. తర్వాత వసతిగృహం సమీపంలో హత్య చేసి బాలుడి చేతిలో ఓ లెటర్ పెట్టి వెళ్లారు. బతకాలనుకన్న వాళ్లు వెళ్లిపోండి.. లేకపోతే ఇక నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News