Saturday, November 16, 2024

కాటేదాన్‌లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… ఓల్డ్ కర్నూల్ రోడ్డులో దుర్గానగర్ కూడలి నుంచి కాటేదాన్ వెళ్లె మార్గంలో ఫుట్ పాత్ పై బ్లాంకెట్లు విక్రయించే చిన్నపాటి తడికెల గుడిసెలో ఓ వ్యక్తి రక్తం మడుగులో మరణించి పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అదే సమయంలో కాటేదాన్ రామయ్య ఆస్పత్రి ఎదురుగా ఉన్న పటేల్ కంపెనీ సమీపంలోని ఓ దుకాణం షటర్ ముందు మెట్ల పై మరో వ్యక్తి హత్యకు గురై పడి ఉన్నట్లు పోలీసుల సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు రెండు సంఘటన స్థలాలకు క్లూస్‌టీమ్, డాగ్‌స్కాడ్‌లతో చేరుకున్నారు. ఎసిపి గంగాధర్ స్వీయ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ మధు శవ పంచనామ నిర్వహించగా, క్లూస్ టీమ్ రక్త నమూనాలు, సంఘటన స్థలిలో హత్యకు ఏమి ఉపయోగించి ఉంటారన్నా కోణంలో వివరాలు సేకరించారు. కాగా మృతులలో ఒక వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాష్‌గా గుర్తించినట్లు సమాచారం.

మృతుడు బ్లాంకెట్లు, క్లాత్‌ల విక్రేతగా స్థానికులు పోలీసులకు తెలిపినట్లు తెలుస్తుంది. మరో మృతుడు ఎవరన్నదీ ఇంకా తెలియరాలేదు.సిసి ఫుటేజీల్లో హత్య ఘటన రికార్డు : హత్య జరిగిన సమయం అర్థరాత్రి 2.33 గంటలుగా సిసి టీవీలో రికార్డు అయింది. దుర్గానగర్ నుంచి కాటేదాన్ మీదుగా వెళ్లె ఓల్డ్ కర్నూల్ రోడ్డులో ఫుట్ పాత్ ఏరియాలో తడికలతో గుడిసెమాదిగా వేసుకుని కొందరు బ్లాంకెట్లు, ఇతర వస్త్రాలు విక్రయించి ఉపాధి పొందుతుంటారు.అందులో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాష్ గుర్తించిన వ్యక్తి కూడా బ్లాంకెట్లు విక్రయించే ప్రదేశంలో నేల పై నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి బండరాయితో తలపై మోది దారుణంగా అంతమోందించాడు. అలాగే కాటేదాన్ డౌన్‌లో పటేల్ కంపెనీ సమీపంలోని ఓ దుకాణం షటర్ ముందు మెట్ల పై నిద్రిస్తున్నవ్యక్తి అదేమాదిరి హత్యకు గురై పడి ఉన్నాడు. అయితే హంతకుడు హత్యలకు పాల్పడుతున్న సమయంలో ఆ ప్రాంతం ప్రధాన రహదారి కావడంతో కొద్ది మేర వాహనాల రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. మృతులను హత్య చేయడానికి గల కారణాలు ఏమిటన్నది తెలియరాలేదు. రాజేంద్రనగర్ ఎసిపి గంగాధర్ ఆధ్వర్యంలో ఈ కేసులను మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ మధు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News