Wednesday, January 22, 2025

మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

యాచారం : ఫార్మాసిటి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గ్రామ శివారులో మహిళను దారుణంగా హత్యచేసి ఆపై గుర్తు పట్టకుండా నిప్పంటించి కాల్చివేసిన వైనం బుధవారం వెలుగులోకి వచ్చి ంది.ఫార్మాసిటి పోలీస్ స్టేషన్ సిఐ రామాంజనేయులు కథనం ప్రకారం.. ముచ్చర్ల గ్రామ శివారులో ఓ మహిళ మృతిచెంది మృతదేహం సగం కాలిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.మృతురాలు మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంథని యాదమ్మ (38) పోలీసులు గుర్తించారు.మృతురాలు తుర్కయాంజాల్ విద్యుత్‌శాఖ డిఈ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.మంగళవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన సదరు మహిళ మధ్యాహ్నాం గం.3.30 ప్రాంతంలో కూతురు అర్చనకు ఫోన్ చేసి కుటుంబ విషయాలు చర్చించినట్లు తెలిపారు.

అనంతరం తన ఫోన్ లిఫ్ట్ చేయక పోవడంతో రాత్రి వరకు ఇంటికి రానందున చుట్టుప్రక్కల బంధువుల ఇండ్లలో వెలికినా ప్రయోజనం లేకపోడవడంతో ఆమె కూతురు మంథని అర్చన మంచాల పోలీస్ స్టేషన్‌లో తన తల్లి తప్పి పోయిందని అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత ముచ్చర్ల సమీపంలోని పొదలలో ఓ గుర్తు తెలియని మహిళ మృతిచెంది కొంతభాగం కాలిపోయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో రాత్రి మంచాలలో ఫిర్యాదు చేసిన అర్చనకు సమాచారం అందజేశారు. అక్కడకు చేరుకున్న మృతురాలి కూతురు అర్చన పాక్షింకంగా కాలిపోయిన మృతదేహాన్ని గమనించి గాజులు,బట్టలు,శరీర భాగాలు చూసి మృతదేహం తన తల్లిదిగా గుర్తించింది.ఆమె భర్త కృష్ణ కూడా రెండు సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖలో పనిచేస్తూ విద్యుదఘాతానికి గురై మరణించాడు.మృతురాలు కూతురు అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని హత్యకుగల కారణాలను వెతుకుతూ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సిఐ రామాంజనేయులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News