Thursday, January 23, 2025

కౌకూర్‌లో యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

జవహార్‌నగర్:  యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన పొదలకూరు సురేష్ (40) ఈ నెల 1వ తేదిన కౌకూర్‌కు చెందిన సెక్యూరిటి గార్డు రాగం నాగేందర్‌రావు ఇంటికి వచ్చాడు. తనకు అద్దె ఇల్లు కావాలని కోరాడు. రూ 3 వేలకు అద్దె ఇల్లు తీసుకుని, సమీపానే ఉన్న జనప్రియలో సురేష్ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. తన ఇంట్లోనే మిత్రులతో కలిసి తప్పతాగి అర్ధరాత్రి సమయంలో నానా యాగీ చేయడంతో ఇంటి యజమాని నాగేందర్‌రావు, సురేష్‌ను ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించాడు.

తనకు ఇచ్చిన అడ్వాన్స్ రూ 1500 తిరిగి సురేష్‌కు చెల్లించాడు. కాగా, ఈ నెల 4 వ తేది గురువారం ఉదయం 9 గంటలకు కౌకూర్ హనుమాన్ దేవాలయం సమీపంలోని శిధిలావస్దకు చేరిన ఓ ఇంటి వద్ద సురేష్ మృత దేహం కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్‌హెచ్‌ఓ సీతారాం సంఘటనా స్ధలానికి చేరుకున్నాడు. టవల్‌తో గొంతు నులిమి, మృతుడి ముఖంపై రాళ్లతో కొట్టి అతి దారుణంగా చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు జాగీలాలతో ఆధారాలు సేకరించారు. మధ్యం మత్తులోనే కొట్టి చంపి ఉంటారని, నిందుతులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News