Monday, December 23, 2024

యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

దౌల్తాబాద్: తన పట్ల ఒక యువకుడు అనుచితంగా ప్రవరిస్తున్నాడని భార్య భర్తకు తెలపడంతో ఆ యువకుడిపై ఆయాచితంగా పగను పెంచుకున్న అతను ఆ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కొడంగల్ సీఐ శంకర్, దౌల్తాబాద్ ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం….మండల కేంద్రానికి చెందిన సంగేపల్లి శేఖర్(35) గ్రామంలో తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకు ంటూ వ్యవసాయ పనులు లేనప్పుడు హైద్రాబాద్‌లో మేస్త్రీగా పనులు చేసుకుం టూ జీవనం కొనసాగించేవాడు. అతనకి వివాహం జరిగి ఒక కూతురు సైతం ఉంది. గ్రామంలో శేఖర్ నివాసం ఉంటున్న ఇంటి పక్కనే బొక్క గోపాల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శేఖర్ గత నాలుగు రోజుల క్రితం తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని గోపాల్ బార్య అతనికి తెలిపిందన్నారు. దాంతో శే ఖర్ పై గోపాల్ కక్షను పెంచుకున్నాడు.

అతనని ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడన్నారు. అందులో బాగంగా గత నాలుగు రోజులుగా సమయం కొరకు ఎదురుచూస్తున్నాడన్నారు. శుక్రవారం రాత్రి శేఖర్‌ను మందు తాగుదామని ఇం ట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళాడన్నారు. శేఖర్ ఇంట్లో నుండి వెళ్ళి రాత్రి పది గంటలు దాటినా ఇంటికి తిరిగి రాక పోవడంతో అతని బార్య ఫోన్ చేసింది. ఫోన్‌లో గోపాల్ తనను కొట్టి చంపుతున్నాడని శేఖర్ గట్టిగా అరవడం విన్న కుటుంబసభ్యులు వెంటనే ఆప్రమత్తమై తనని వెతికేందుకు భయలుదేరారు. కాని అతని ఆచూకి తెలియలేదు. దీంతో శేఖర్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతం మొత్తం గాలించారు. వీరితో పాటు గోపాల్ సైతం తనకేమీ తెలియనట్లు నటిస్తూ వారితో పాటు శేఖర్‌ని వెతకసాగాడు. దీంతో శేఖర్ బార్య నా భర్తను నువ్వే చంపి ఏం ఎరగనట్లు మళ్ళీ వెతకడానికి వచ్చావని గోపాల్‌ని నిలదీసింది.

అనుమానం వచ్చిన పోలీసులు గోపాల్‌ను విచారించగా తనకేం తెలియదని పొంతన లేని సమాదానాలు ఇచ్చాడన్నారు. దీంతో పోలీసులు తమదైన విదానంలో విచారించగా శేఖర్‌ని హత్య చేసిన ప్రదేశం పోలీసులకు చూపించాడన్నారు. అప్పటికే బీరుసీసాలతో తలపై కొట్టడం, రాయితో చాతీపై భలంగా కొట్టడం, గొంతు పిసకడంతో శేఖర్ అప్పడికే మృతి చెంది ఉన్నాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. మృతుడి భార్య ఉషంతమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని శనివారం ఉదయం పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరుగకుండా తమ సిబ్బందితో గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు. యువకుడి దారుణ హత్యతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్క సారిగా ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News