మనతెలంగాణ, హైదరాబాద్ : యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన నగరంలోని శాలిబండలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని పాలబస్తీ, బహదూర్‌పురాకు చెందిన సయ్యద్ అన్వర్ కుమారుడు, సయ్యద్ జుబేర్(23) పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. గతంలో కిల్వత్ ప్రాంతంలో కొద్ది రోజులు ఉన్నాడు. శుక్రవారం రాత్రి తన స్నేహితులను కలిసేందుకు శాలిబండకు వచ్చాడు. ఈ క్రమంలోనే జుబేర్ ఆషా ప్రాక్టీస్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో హత్యకు గురయ్యాడు. ఉదయం వెళ్లిన భవన నిర్మాణ కార్మికులు జుబేర్ హత్యకు గురైన విషయం చూసి స్థానికులకు చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు చెప్పడంతో హుస్సేనీఆలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతుడికి గతంలో కొందరితో పాతగొడవలు ఉన్నట్లు తెలిసింది. సంఘటన స్థలానికి సౌత్‌జోన్ డిసిపి గజారావు భూపాల్, ఎసిపి బిక్షం రెడ్డి, హుస్సేనీఆలం ఇన్స్‌స్పెక్టర్ నరేష్కుమార్,కాలాపత్తర్ ఇన్స్‌స్పెక్టర్ సుదర్శన్ పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. నిందతులను పట్టుకునేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేసినట్లు ఎసిపి బిక్షం రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.