Thursday, January 23, 2025

మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఇంటిపై దాడి!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: శివమొగ్గ జిల్లాలో సోమవారం కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యెడియూరప్ప ఇంటిపై కోపోద్రిక్తులైన జనం దాడిచేశారు. బంజార కమ్యనిటీకి చెందిన వారు శివమొగ్గ జిల్లాలోని షికారిపుర పట్టణంలో ఉన్న ఆయన ఇంటిపై దాడిచేశారు. రాష్ట్రప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు(ఎస్సీలకు) ప్రకటించిన అంతర్గత రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా వారు రెచ్చిపోయారు. రాళ్లు రువ్వారు, కొందరు పోలీసులను కూడా గాయపరిచారు. సిఆర్‌పిసి 144 సెక్షన్ కింద నిషేధ ఉత్తర్వులు పట్టణంలో విధించారు.
పెద్ద సంఖ్యలో ఉన్న నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ప్రయోగం చేశారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. లమనీ, లంబానీ అని పిలువబడే బంజార కమ్యూనిటీకి చెందిన కొంత మంది గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులు యెడియూరప్ప ఇంటిపైకి రావడంతో పోలీసులు కూడా ఖంగు తిన్నారు. వారిలో ఎక్కువ మంది యువకులే. వారు యెడియూరప్ప ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టారు. తక్కువ రిజర్వేషన్లు ఇవ్వడంపై బంజార కమ్యూనిటికీ చెందిన వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రం కావడంతో అదనపు బలగాలను పిలిపించారు.Ban

ఎస్సీలకు రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి పెంచారు. ఎస్సీలోని మిగతా సబ్‌క్యాటగిరీల వారికి 6 శాతం ఇచ్చారు. అందులో 5.5 శాతం ఎస్సీ రైట్, 4.5 శాతం టచేబుల్స్, 1శాతం ఇతరులకు సిఎం బసవరాజ్ బొమ్మై ఇచ్చారు.
రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో దీనిని పెట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసింది. చాలా మంది బంజార కమ్యూనిటీకి చెందిన వారు ఈ నిర్ణయంతో తమకు ఎస్సీ హోదా పోతుందని భావించారు. ఈ నిర్ణయాన్ని వెంటను ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News