Monday, January 20, 2025

ఏప్రిల్ 1 నుంచి అందబాటులోకి రానున్న బిఎస్ 6 స్టేజ్ 2 వాహనాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : పర్యావరణానికి మరింత ప్రయోజం కలిగించే బిఎస్ 6 స్టేజ్ వానాలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. బిఎస్ (భారత్‌స్టేజ్ )4 వాహనాలు 2017లో ఆలస్యంగా అందుబాటులోకి రావడంతో ఇటు ఆటోమోబైల్ పరిశ్రమల నిర్వాహకులకు అటు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారత్ స్టేజ్ 5 రకం వాహనాలను దాటేసి నేరుగా బిఎస్ స్టేజ్ 6 వాహనాలను ప్రవేశపెట్టింది. దీనిలో ఉన్న ఆధునిక టెక్నాలజిని పరిగణలోకి తీసుకుని దీన్ని రెండు రకాలుగా విభజించింది. మొదటి దశ ఏప్రిల్ 2020లో అమలు కాగా బిఎస్ 6స్టేజ్ 2వ దశ ఏప్రిల్ 1 నుంచి అమలుకానుంది. ఈ రెండో దశలో వాహనాలు పర్యావరణానికి మరింత మేలు చేకూరే విధంగా ఉండాలి.

కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా అన్ని వాహనాలు ఓబిడి2( ఆన్‌బోర్డు డయాగ్నస్టిక్స్) ప్రమాణాలను కలిగి ఉండాలనే నిబంధనలు పాటిస్తూ దీన్ని రూపొందించారు. ఓబిడి అనేది సదరు వాహనంలో ఉండే ఎలక్ట్రానిక్ పరికరం. ఇది వాహన ఆక్సీజన్, ఇంజన్‌మిస్‌ఫైర్ విధానాన్ని పర్యవేక్షించే విధంగా రూపొందించబడుతుంది. దీంతో బిఎస్ 6 స్టేజ్ 2 వాహన సామర్ధం మరింత పెరగడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించే విధంగా మార్పులు చేర్పులు చేశారు. అయితే దీనికి తయారీలో అదనపు వ్యయం కావడంతో వాహనాలు ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే బిఎస్ 6 స్టేజ్ రెండోవ దశ వాహనాలు ఖరీదు పెంచుకునేందుకు కేంద్ర రవాణశాఖకు అనుమతి పెడరేషన్ ఆప్ ఆటోమోబైల్ డీలర్స్ అసోసిసయేషన్( ఎఫ్‌ఏడిఏ) కూడా అనుమతి ఇచ్చినట్లు సమాచారం. మార్చి 31 వరకు తయారు చేయబడ్డవాహనాల వివరాలను నిబంధనల ప్రకారం వాహాన్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వాహనాల చాసిస్,ఇంజన్‌ల మీద ఏప్రిల్ నెలతో కూడి ఉండటమే కాకుండా సదరు వాహన మోడల్ ( రకం) కూడా నమోదు చేయనున్నారు. అంతకు ముందు అమ్మిన వాహనాలు 2022 కింద రిజిస్ట్రర్ చేయబడతాయి. అయితే వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలు, లైఫ్ ట్యాక్స్‌లో ఎటువంటి మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు.

మాకు సమాచారం ఉంది.. షోరూం నిర్వాహకులు 

బిఎస్ 6 స్టేజ్ 2 వాహనాలకు సంబంధించిన సమాచారం ముందుగానే తెలిసిందని, ఇప్పటికే అందుకు సంబంధించిన వాహనాలు తమ వద్ద ఉన్నాయని షోరూం నిర్వాహకులు తెలుపుతున్నారు. బిఎస్ 6 స్టేజ్ 2 వాహనాలకు సంబంధించి టెక్నికల్ సిబ్బందితో పాటు, ఇతర సిబ్బందికి కూడా ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చినట్లు వారు తెలిపారు. బిఎస్ 6 స్టేజ్ 1 వాహనాలతో పోలిస్తే బిఎస్ 6 స్టేజ్ 2 దశ వాహనాల్లో అనేక మార్పులు చేసినట్లు చెబుతున్నారు. ఇంజన్ సామర్ధం పెంచడమే కాకుండా వాహనాల ఫీచర్స్‌లో కూడా మార్పులు చేయడంతో బిఎస్ 6 స్టేజ్ 2 రకం వాహనాలు వాహనాదారులకు అన్ని రకాలగా సౌకర్యవంతంగా ఉంటాయని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News