Monday, November 18, 2024

హెచ్చుతగ్గుల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ హెచ్చు తగ్గులను చూసింది. చాలా రంగాల షేర్లు నష్టపోగా, ఐటి రంగం మాత్రం పుంజుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 69 పాయింట్లు పతనమై 66,459 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 19,735 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఐటి షేర్ల కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ ఐటి 360 పాయింట్ల జంప్‌తో 30,288 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇంకా ఫార్మా, మెటల్స్, కమోడిటీ స్టాక్‌లలో కూడా బూమ్ ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా పెరిగాయి. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎంసిజి, రియల్ ఎస్టేట్, మీడియా, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 15 లాభాల్లో, 15 నష్టాలతో ముగిశాయి. స్టాక్స్ విషయానికొస్తే, ఎన్‌టిపిసి షేర్లు 3.07 శాతం, టెక్ మహీంద్రా 2.50 శాతం, హెచ్‌సిఎల్ టెక్ 1.88 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.17 శాతం, టిసిఎస్ 0.87 శాతం, ఇన్ఫోసిస్ 0.75 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు పవర్ గ్రిడ్ 5.36 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.62 శాతం, రిలయన్స్ 1.38 శాతం నష్టపోయాయి.

స్టాక్ మార్కెట్ పతనమైనప్పటికీ మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపదలో పెరుగుదల కనిపించింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.306.80 లక్షల కోట్లకు చేరగా, అంతకుముందు రోజు ఇది రూ.306.65 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇన్వెస్టర్ల సంపద రూ.15,000 కోట్ల మేర పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News