Sunday, January 19, 2025

67,000 తాకిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. మంగళవారం ఐటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 67,007 స్థాయిని, నిఫ్టీ 19,819 స్థాయిని తాకాయి. అయితే దీని తర్వాత మార్కెట్ తగ్గడంతో సెన్సెక్స్ 205 పాయింట్లు పెరిగి 66,795 వద్ద ముగిసింది.

నిఫ్టీ కూడా 37 పాయింట్లు లాభపడి 19,749 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 15 వృద్ధి చెందగా, 15 మాత్రమే క్షీణించాయి. ఐటి రంగ షేర్లలో కొనుగోళ్ల నుంచి మద్దతు లభించింది. ఇన్ఫోసిస్ స్టాక్ 3 శాతానికి పైగా లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 0.09 శాతం, పిఎస్‌యు బ్యాంక్ 1.23 శాతం, రియల్టీ 0.85 శాతం నష్టపోయాయి. నెట్‌వెబ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపిఒ 2 రోజులలో 5 సార్ల కంటే ఎక్కువ సభ్యత్వం పొందింది. ఈ ఐపిఒలో జూలై 19 వరకు వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News