Monday, December 23, 2024

పెరిగినట్టే పెరిగి మళ్లీ నష్టాల్లోకి..

- Advertisement -
- Advertisement -

BSE Sensex tanked 1142 points

గతవారం 1,142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

మార్కెట్ సమీక్ష

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గతవారం ప్రారంభంలో నష్టాలతో మొదలు పెట్టి, మధ్యలో లాభాలను చూశాయి. ఆఖరి రోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తంగా వారంలో సెన్సెక్స్ 1,142 పాయింట్లు కోల్పోయింది. వారాంతం శుక్రవారం సెన్సెక్స్ 57,197 పాయి ంట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 220 పాయింట్లు కోల్పోయి 17,171 పాయింట్ల వద్ద స్థిరపడింది. అయితే రికవరీ అవుతోందనుకుంటున్న దశలో మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను వచ్చే నెలలో పెంచనుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలు పెంచారు. దీంతో ఆఖరి రోజు మళ్లీ భారీగా నష్టాలు వచ్చాయి.

సోమవారం : దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం అమ్మకాల ఒత్తిడితో నష్టపోయాయి. సెన్సెక్స్ అత్యధికంగా 1,291 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లు ఆవిరైంది. బలహీనంగా ప్రారంభమైన బిఎస్‌ఇ సెన్సెక్స్ ఆఖరికి 1,292 పాయింట్లు పడిపోయి 57,047 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 302 పాయింట్లు పడిపోయి 17,173 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఎన్‌టిపిసి, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం భయం, చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, రష్యాపై విధించిన నిషేధం మార్కెట్ పతనానికి కారణమని భావిస్తున్నారు. బ్యాంక్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా షేర్లలో అత్యధిక పతనం కనిపించింది.

మంగళవారం : మార్కెట్లు వరుసగా ఐదో రోజు సోమవారం నష్టాలను కొనసాగించాయి. ఐటి, ఫైనాన్షియల్, కన్జూమర్ గూడ్స్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మళ్లీ మార్కె ట్లు కుదేలయ్యాయి. ప్రారంభంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవ్వగా, ఆఖరి సమయంలో మాత్రం భారీగా పతనమయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 704 పాయింట్లు కోల్పోయి 56,463 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయి 16,959 పాయింట్ల వద్ద స్థిరపడింది. నాలుగో త్రైమాసిక ఫలితాలు బలహినంగా ఉండడం, రష్యాఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణాలతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు భారీగా పతనమయ్యాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, దాని మాతృ సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డిఎఫ్‌సి) షేర్లలో భారీ పతనం కనిపించింది.

బుధవారం : ఈక్విటీ మార్కెట్లు ఐదు రోజు ల వరుస నష్టాలకు బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 574 పాయింట్లు పెరిగి 57,037 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 17,136 పాయింట్ల వద్ద ముగిసింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా పెరిగాయి. ప్రధానంగా అల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్, మారుతీ, రిలయన్స్ లాభాలను నమోదు చేయగా, మరోవైపు టిసిఎస్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యుఎల్, హెచ్‌డిఎఫ్‌సి నష్టపోయాయి.

గురువారం : వరుసగా రెండో రోజు గురువారం లాభాలను నమోదు చేశాయి. రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5.74 లక్షల కోట్లు పెరిగింది. గత ఐదు రోజులుగా నష్టాలను చూసిన మార్కెట్లు బుధవారం, గురువారం మంచి లాభాలను చూశాయి. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5,74,428 కోట్లు పెరిగి రూ.271.77 లక్షల కోట్లకు పెరిగింది. కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ మాట్లాడుతూ, సానుకూల అంతర్జాతీయ పరిణామాలు రెండో రోజు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చాయని, వివిధ రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు లాభపడ్డాయని అన్నారు.

శుక్రవారం : రెండు రోజుల ర్యాలీ తర్వాత వారాంతం శుక్రవారం మార్కెట్లు పతనమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను వచ్చే నెలలో పెంచనుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలు పెంచడంతో సెన్సెక్స్ 714 పాయింట్లు నష్టపోయి 57,197.15 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 220 పాయింట్లు పడిపోయి 17,171 వద్ద స్థిరపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News