Monday, December 23, 2024

మణిపూర్ లో కాల్పులు… బిఎస్‌ఎఫ్ జవాన్ మృతి

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్ సిరౌ ప్రాంతంలో సోమవారం రాత్రి బాగా పొద్దు పోయాక వేర్పాటు వాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరగడంతో బిఎస్‌ఎఫ్ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అసోం రైఫిల్స్ సైనికులు ఇద్దరి కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ సైనికులను మంత్రిపుఖీ ఆస్పత్రికి తరలించారు. మణిపూర్ లోని సుగ్ను, సెరు ప్రాంతంలో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు బీఎస్‌ఎఫ్,

అస్సాం రైఫిల్స్, స్థానిక పోలీస్‌లు గస్తీ చేపట్టిన సమయంలో ఈ కాల్పులు మొదలయ్యాయి.ఈ దాడులను భద్రతా దళాలు తిప్పి కొట్టాయని సైన్యానికి చెందిన స్పియర్ కోర్ కమాండ్ పేర్కొంది. మరోవైపు సోమవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఇంఫాల్ పశ్చిమ జిల్లా కాంగ్‌చుప్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నట్టు పోలీస్‌లు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News