Thursday, January 23, 2025

రూ.80 కోసం ఓ వ్యక్తిని కాల్చిన జవాన్

- Advertisement -
- Advertisement -

పాట్నా: 80 రూపాయల కోసం ఆట బొమ్మలు అమ్మే వ్యక్తిని బిఎస్‌ఎఫ్ జవాన్ తుపాకీతో కాల్చిన సంఘటన బీహార్ రాష్ట్రం శివాన్ జిల్లా పోఖారా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహారాజ్‌గంజ్ ప్రాంతం రతన్‌పూర్ గ్రామానికి చెందిన ఉజ్వల్ కుమార్ పాండే అనే వ్యక్తి బిఎస్‌ఎఫ్ జవానుగా పని చేస్తున్నాడు. మునిలాల్ రామ్ అనే వ్యక్తి పోఖారా గ్రామంలో ఆట బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఉజ్వల్ కుమార్ ఆట బొమ్మలు అమ్మే వ్యక్తి వద్దకు వచ్చాడు. ఆట బొమ్మ కింద పడేయడంతో పగిలిపోయింది. దీంతో బొమ్మకు రూ.80 ఇవ్వాలని జవాన్‌ను మునిలాల్ అడిగాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. వెంటనే ఉజ్వల్ తుపాకీ తీసి అతడిపై కాల్పులు జరిపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన మునిలాల్‌ను ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్న పాండేను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీస్ అధికారి పోలాస్ట్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News