పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఇండియాబంగ్లాదేశ్ సరిహద్దులో బంగ్లాదేశీ పశు స్మగ్లర్లు, భారత సరిహద్దు రక్షణ బలగాల(బిఎస్‌ఎఫ్) జవాన్లపై గురువారం రాత్రి దాడి చేశారు. ఈ విషయాన్ని పారామిలిటరీ బలగాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆ తర్వాత భారత బిఎస్‌ఎఫ్ బలగాలు కూడా ప్రతిదాడి చేశాయి. పశువుల స్మగ్లింగ్‌ను అరికట్టి 10 ఎడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఖుతధ బార్డర్ ఔట్‌పోస్ట్ వద్ద జరిగింది.
పశువులతో స్మగ్లర్లు సరిహద్దు కంచె వద్దకు వచ్చినప్పుడు బిఎస్‌ఎఫ్ సిబ్బంది వారిని అడ్డగించింది. స్మగ్లర్లు హెచ్చరికను బేఖాతరు చేసి కంచెను తెగగొట్టాలని చూశారు. రాత్రివేళను వారు తమకు అనుకూలంగా చేసుకున్నారు. దాంతో బిఎస్‌ఎఫ్ జవాన్లు బ్లాంక్ రౌండ్లు కాల్చారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ మన జవానులు అప్రమత్తంగా ఉండి తమ విధులను భేషుగ్గా నిర్వర్తిస్తున్నారు.