Saturday, November 16, 2024

త్రిపురలో ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్ల మరణానికి దారితీసిన ఘర్షణ

- Advertisement -
- Advertisement -
BSF jawans fired each other in Tripura
మరో సీనియర్ అధికారికి గాయాలు

న్యూఢిల్లీ/ అగర్తల: త్రిపురలోని బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఒక సైనిక పోస్టు వద్ద ఒక సోదరుల మధ్య జరిగిన కాల్పుల పోరులో ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లు మరణించగా మరో సీనియర్ అధికారి గాయపడ్డారు. గోమతి జిల్లాలోని కర్బూక్ సబ్ డివిజన్‌లోగల ఖగ్రచేరి పోస్ట్ వద్ద గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 20వ బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సత్బీర్ సింగ్, కానిస్టేబుల్ ప్రతాప్ సింగ్ మధ్య స్వల్ప వివాదం కాల్పుల పోరుకు దారితీసిందని బిఎస్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు. ప్రతాప్ సింగ్ జరిపిన కాల్పులలో సత్బీర్ సింగ్ అక్కడికక్కడే మరణించాడని ఆయన చెప్పారు. అక్కడే ఉన్న సెంట్రీ జరిపిన కాల్పులలో ప్రతాప్ సింగ్ కూడా మరణించాడని ఆయన తెలిపారు. ప్రతాప్ సింగ్ జరిపిన కాల్పులలో పోస్ట్ కమాండర్, సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్ కుమార్ రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, సిలాచెరి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ప్రతినిధి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News