Monday, December 23, 2024

వడదెబ్బకు బిఎస్‌ఎఫ్ అధికారి, జవాన్ మృతి

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్‌లో భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు పొడుగునా హరామి నాలా కయ్య ప్రాంతంలో ‘దుర్భర వాతావరణం’ కారణంగా గస్తీలో ఉన్న సరిహద్దు భద్రత దళం (బిఎస్‌ఎఫ్) అధికారి ఒకరు, జవాన్ ఒకరు మరణించినట్లు బిఎస్‌ఎఫ్ శనివారం వెల్లడించింది. అసిస్టెంట్ కమాండెంట్ విశ్వ దేవ్, హెడ్ కానిస్టేబుల్ దయాళ్ రామ్ సరిహద్దులో శుక్రవారం వడదెబ్బకు, నిర్జలీకరణానికి గురయినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.

రాణ్ ఆఫ్ కచ్, హరామి నాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 34, 36 సెల్షియస్ డిగ్రీల మధ్య ఉన్నాయి. తేమ శాతం 80 శాతం నుంచి 82 శాతం వరకు ఉన్నది. హరామీ నాలా చిత్తడి నేల ప్రాంతంలో గస్తీ బృందానికి నీటి, శక్తినిచ్చే ద్రవాల కొరత ఏర్పడినట్లు, నీటిని సమీప స్థావరం నుంచి గస్తీ బృందానికి హుటాహుటిని పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. బిఎస్‌ఎఫ్ సిబ్బంది ఇద్దరినీ సాయంత్రానికల్లా భుజ్‌లో ఒక ఆరోగ్య కేంద్రానికి హుటాహుటిని తరలించారని, కాని వారి ప్రాణాలు కాపాడలేకపోయారని ఆ వర్గాలు వివరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News