Sunday, January 19, 2025

రివాల్వర్‌తో కాల్చుకుని బిఎస్‌ఎఫ్ ఆఫీసర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

BSF officer shot dead by revolver

అగర్తలా : త్రిపుర ధలై జిల్లా జవహర్‌నగర్ ఏరియా లోని బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ బయట బిఎస్‌ఎఫ్ ఆఫీసర్ తన రివాల్వర్ తోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి. ధలైలో ఎంకె పారా బోర్డర్ పోస్టులో బిఎస్‌ఎఫ్ ఆఫీసర్‌గా నియామకం అయ్యాడు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకెళ్లామని, అప్పటికే ఆయన చనిపోయాడని ధలై ఎస్‌పి రమేష్ యాదవ్ చెప్పారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News