- Advertisement -
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక పొలంలో భారీ స్థాయిలో మారయుధాలను సరిహద్దు భద్రతా దళం(బిఎస్‌ఎఫ్) సిబ్బంది మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లోని ఒక పొలంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న బిఎస్‌ఎఫ్ సిబ్బందికి 6 మ్యాగజైన్లతోపాటు మూడు ఎకె47 తుపాకులు, నాలుగు మ్యాగజైన్లతోకలిపి రెండు ఎం-3 సబ్ మెషిన్ గన్లు, రెండు మ్యాగజైన్లతోపాటు రెండు పిస్టల్స్ లభించినట్లు ఢిల్లీలో అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ నుంచి వీటిని అక్రమంగా తరలించి ఆ పొలంలో దాచి ఉంటారని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. బిఎస్‌ఎఫ్ సిబ్బంది సకాలంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఈ మారణాయుధాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడకుండా నివారించినట్లయిందని ఆయన చెప్పారు.
- Advertisement -