న్యూఢిల్లీ: పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఒక డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం(బిఎస్‌ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపి కూల్చివేసినట్లు బిఎస్‌ఎఫ్ శనివారం తెలిపింది. ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లోని వాన్ బార్డర్ పోస్టు సమీపంలో శుక్రవారం రాత్రి 11.10 గంటల ప్రాంతంలో చైనా తయారీ డ్రోన్‌ను బిఎస్‌ఎఫ్ సిబ్బంది గుర్తించి, కూల్చివేసినట్లు బిఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు 300 మీటర్లు, సరిహద్దు కంచెకు 150 మీటర్ల దూరంలో నలుపు రంగులో ఉన్న డ్రోన్‌ను కూల్చివేసినట్లు బిఎస్‌ఎఫ్ తెలిపింది. నాలుగు పవర్ బ్యాటరీలతో నడిచే నాలుగు రెక్కలతో కూడిన ఈ డ్రోన్ సుమారు 23 కిలోలు ఉందని, ఇది 10 కిలోల బరువైన మందుగుండును మోసుకుని వెళ్లగలదని బిఎస్‌ఎఫ్ పేర్కొంది. అయితే కూల్చివేసిన సమయంలో డ్రోన్‌లో ఎటువంటి మందుగుండు కాని ఆయుధం కాని లేదని తెలిపింది. సంఘటన జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కూల్చివేత
- Advertisement -
- Advertisement -
- Advertisement -