Monday, January 20, 2025

పాక్ నుంచి వస్తున్న చైనా డ్రోన్ ను కూల్చివేసిన బిఎస్ఎఫ్

- Advertisement -
- Advertisement -

 

made in China drone

అమృత్‌సర్(పంజాబ్)‌: పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తున్న చైనా తయారీ డ్రోన్‌ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు కూల్చివేశారు. పంజాబ్‌ రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చైనా డ్రోన్ ను తెల్లవారుజామున కూల్చివేసినట్లు బిఎస్‌ఎఫ్ దళం ప్రతినిధి తెలిపారు.అమృత్‌సర్ ప్రాంతంలోని ధనో కలాన్ గ్రామం సమీపంలోని పాక్ సరిహద్దుల్లో ముందు సైనికులు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున సరిహద్దుల్లో ఎగురుతున్న చైనా తయారీ డ్రోన్ ను బిఎస్ఎఫ్ అడ్డుకొని కూల్చివేశారు.డిజెఐ మ్యాట్రిస్ -300 మోడల్ కు చెందిన మేడ్ ఇన్ చైనా డ్రోన్ ను ఉదయం 6.15 గంటల సమయంలో సరిహద్దుల్లో కూల్చివేసి దాన్ని స్వాధీనం చేసుకున్నామని బిఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. పాక్ వైపు నుంచి చైనా డ్రోన్ రావడంతో సరిహద్దుల్లో భారత సైనికులు అప్రమత్తమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News