Thursday, January 23, 2025

డ్రోన్ నుంచి 10 కిలోల హెరాయిన్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పాకిస్తాన్ నుంచి హెరాయిన్‌ను తీసుకువస్తున్న ఒక డ్రోన్‌ను పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపాన సరిహద్దుల్లో బిఎస్‌ఎఫ్ సిబ్బంది కూల్చివేశారు. డ్రోన్ నుంచి తొమ్మిది ప్యాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని సీమాంతర డ్రగ్స్ స్మగ్లింగ్‌ను భగ్నం చేసినట్లు బిఎస్‌ఎఫ్ సిబ్బంది సోమవారం వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఒక డ్రోన్‌ను గుర్తించిన బిఎస్‌ఎఫ్ సిబ్బంది దాన్ని కూల్చివేయగా ఒక బ్యాగులో 9 ప్యాకెట్లలో ఉన్న 10.670 కేజీల హెరాయిన్‌ను అందులో నుంచి స్వాధీనం చేసుకున్నట్లు బిఎస్‌ఎఫ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News