Saturday, December 21, 2024

పాక డ్రోన్‌ను కూల్చేసిన బిఎస్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

BSF shot down a Pakistani drone

చంఢీగర్: పంజాబ్‌లోని అమృతసర్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్‌ఎఫ్)కు చెందిన దళాలు క్రవారం పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేశాయి. పాక్ భూభాగం నుంచి భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో డ్రోన్‌ను కూల్చేశామని బిఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం సమయంలో పాకం వైపు నుంచి డ్రోన్‌ను గుర్తించిన షాపూర్ బోర్డర్ ఔట్‌పోస్టులోని బిఎస్‌ఎఫ్ సిబ్బంది 17 రౌండ్లు కాల్పులు జరిపారన్నారు. అస్పష్టంగా ఉన్నడ్రోన్ భారత సరిహద్దులోకి ప్రవేశించగానే బాంబులుతో దాన్ని కూల్చివేశామని, డ్రోన్ గిల్ గ్రామంలో కూలిపోయిందని అధికారులు వివరించారు. అనంతరం నాలుగు కిలోల బరువున్న డ్రోన్ శిథిలాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నైలాన్ తాడు, రిఫ్లెక్టర్ లైట్లు, గ్రీన్ పట్టీని కనుగొన్నామని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. డైరెక్టర్ జనరల్ సింగ్ మాట్లాడుతూ పంజాబ్‌లోని కిలోమీటర్ల మేర పాకిస్థాన్ సరిహద్దు వెంబడి తమ దళాలు పహారా కాస్తున్నాయన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News