Monday, December 23, 2024

సరిహద్దులో పాక్ డ్రోన్ ను పడగొట్టిన బిఎస్ఎఫ్ బలగాలు

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్: పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్) పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో కూల్చేసింది. భారత భూభాగంలోని అమృత్‌సర్‌కు ఉత్తరాన 40 కిమీ. దూరంలో ఉన్న చాహర్‌పూర్‌లోకి చొరబడిన ఆ డ్రోన్‌పై సోమవారం రాత్రి బిఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపింది. ఆ తరువాత జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో పాక్షికంగా దెబ్బతిన్న హెక్సాకాప్టర్ లభించింది. ఆరు రోటర్లు ఉన్న మానవ రహిత ఏరియల్ వాహనం అది. దాని అడుగు భాగంలో అనుమానస్పద వస్తువు వైట్ కలర్ పాలిథిన్‌లో చుట్టబడి లభించిందని అధికారులు చెప్పారు. ఆ డ్రోన్ మాదకద్రవ్యాలను తెచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఇంకా దృవీకరణ కావలసి ఉంది. అప్రమత్తంగా ఉన్న బిఎస్‌ఎఫ్ జవానులు మరోసారి డ్రోన్ల స్మగ్లింగ్ యత్నాన్ని వమ్ముచేశారు. నవంబర్ 25న కూడా బిఎస్‌ఎఫ్ బలగాలు అంతర్జాతీయ సరిహద్దు వద్ద అమృత్‌సర్‌లో ఓ పాకిస్థాన్ డ్రోన్‌ను పడగొట్టిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News