Tuesday, December 24, 2024

జమ్మూలో పాక్ డ్రోన్‌పై బిఎస్‌ఎఫ్ కాల్పులు

- Advertisement -
- Advertisement -

BSF troops open fire at Pakistani drone

జమ్మూ: పాకిస్తాన్ వైపు నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్న ఒక డ్రోన్‌పై జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న సరిహద్దు భద్రతా దళం(బిఎస్‌ఎఫ్) సిబ్బంది కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ వెనకకు వెళ్లిపోయింది. డ్రోన్ నుంచి ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలు కిందకు జారవిడిచారా అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి బిఎస్‌ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు జమ్మూ ఫ్రాంటియర్ బిఎస్‌ఎఫ్ డిఐజి ఎస్‌పి సాంధు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 4.45 ప్రాంతంలో ఆకాశంలో వెలుగుతూ ఆరుతున్న ఒక లైటును బిఎస్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారని, వెంటనే ఆ వస్తువుపై కాల్పులు జరపగా అది వెనుకకు మరలిపోయిందని ఆయన చెప్పారు. పాకిస్తానీ డ్రోన్‌ను కూల్చివేయడానికి ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. గత వారం రోజుల్లో పాక్ డ్రోన్ చొరబాటుకు సంబంధించి ఇది రెండవ సంఘటన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News