ప్రముఖ టెలికాం సంస్థలు జిఉ ఐడియా, ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే దేశంలోని యూజర్లందరూ తమ సిమ్ ను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ బిఎస్ఎన్ఎల్ సరసమైన, చౌకైన రీఛార్జ్ ప్లాన్ లను అందిచడం. ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు చౌక రీఛార్జ్ ప్లాన్‌ల సౌకర్యాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు రూ. 298 BSNL ప్లాన్ గురుంచి తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ రూ. 298 రీఛార్జ్ ప్లాన్‌తో తమ వినియోగదారులకు అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ చెల్లుబాటు పూర్తిగా 52 రోజుల వరకు అందుబాటులో ఉంది. అయితే ఇది 2 నెలల రీఛార్జ్ ప్లాన్‌కు చౌకైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ వివరాలు చూస్తే..
ప్లాన్ చెల్లుబాటు – 52 రోజులు
డేటా- 1GB/రోజు
కాలింగ్- అపరిమిత
ఎస్ఏంఎస్ – 100 SMS/రోజు
అయితే, ఈ చౌకైన ప్లాన్ అపరిమిత కాల్స్ మాట్లాడేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దాదాపు 2 నెలల పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. ఇంటర్నెట్‌కు సంబంధించి మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌పై ఎక్కువగా ఆధారపడని వినియోగదారులకు కూడా ఇది ఉత్తమమైన ప్లాన్.