Wednesday, January 8, 2025

బీఎస్ఎన్ఎల్ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. రూ.100 కంటే తక్కువ

- Advertisement -
- Advertisement -

జియో, ఎయిర్ టెల్ ఇటీవల రీఛార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రభుత్వ టెలికాం బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులను ఆకర్షించుకోవడానికి అత్యల్ప ధరలకు రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో రూ. 100లోపు అనేక గొప్ప ప్లాన్‌లు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

రూ.97 ప్లాన్

మొదటి ప్లాన్ చూస్తే.. ఈ ప్లాన్‌లో 15 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు ప్రతిరోజూ 2GB డేటాను
అందిస్తోంది. కాగా, ఇందులో మొత్తం 30GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా.. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. డేటా పరిమితి అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40Kbpsకి తగ్గుతుంది.

రూ.98 ప్లాన్

రెండవ ప్లాన్ చూస్తే.. దీని ధర రూ. 98 గా ఉంది. ఈ ప్లాన్ 18 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ప్రతిరోజూ 2GB డేటాను పొందొచ్చు. ఇందులో మొత్తం 36 GB డేటా వస్తుంది. డేటా పరిమితిని చేరుకున్న తర్వాత వేగం 40 Kbps వద్ద ఉంటుంది.

రూ.94 ప్లాన్

ఇది కేవలం 94 రూపాయలకు 30 రోజుల చెల్లుబాటును అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో డేటా కొరత ఉండదు. ఎందుకంటే కంపెనీ ప్రతిరోజూ 3GB డేటాను ఇస్తోంది. మొత్తం 90GB డేటాను పొందుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News