Wednesday, January 22, 2025

బిఎస్‌ఎన్‌ఎల్ దీపావళి ధమాకా ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ దీపావళికి బిఎస్‌ఎన్‌ఎల్ ధమాకా ఆఫర్లను అందిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేయడం వల్ల అదనంగా డేటా కూడా లభించనున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. అయితే బిఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్స్‌లో రీఛార్జ్ చేస్తేనే అదనపు డేటా లభించనుంది. రీఛార్జ్ ప్లాన్స్ వివరాలను చూస్తే.. రూ.251 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. మొత్తం మీద 70 జీబీ డేటా అందించనున్నారు. దీపావళి సందర్భంగా అదనపు డేటా లభించనుంది. ఇది 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రూ.299 ప్లాన్‌తో కూడా అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. దీని రీఛార్జ్ మాత్రం సెల్ఫ్ కేర్ యాప్‌లో చేయాల్సి ఉంటుంది. యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అందుబాటులో ఉండనుంది.30 రోజుల పాటు వ్యాలిడిటీ లభించనుంది. ఇందులో రోజుకు అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్లు లభిస్తాయి.

అదేవిధంగా రూ.398తో రీఛార్జ్ చేస్తే.. 120 జీబీ డేటాతో పాటు అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్లు లభించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు ఉండనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ ధర రూ.1,198 కాగా, అతి తక్కువ చవకైన ప్లాన్ ధర రూ.439గా ఉంది. రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లాంగ్ టర్మ్ ప్లాన్లు కావాలనుకునేవారికి బాగా పనిచేస్తుంది. ఇందులో నెలకు 3 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 ఎస్‌ఎంఎస్లు లభించనున్నాయి. రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో అన్లిమిడెట్ వాయిస్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్లు లభించనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News