Monday, January 27, 2025

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

ఇటీవల టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచడంతో దేశంలోని అనేక వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ సిమ్ కు పోర్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీని కారణంగానే బిఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లను తీసుకువస్తుంది. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. ఈ టెలికాం సంస్థ త్వరలో కొన్ని అద్భుతమైన ఆఫలను తీసుకువస్తుంది. ఇందులో భాగంగా ఒకే రీఛార్జ్ ప్లాన్లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటిటి సేవలను అందిస్తోంది.

ఇటీవల ఎక్స్ వేదికగా బిఎస్ఎన్ఎల్ ఆస్క్ బిఎస్ఎన్ఎల్ ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో చాలామంది వినియోగదారులు వివిధ ప్రశ్నలు అడిగారు. ఈ సమయంలోనే ఒక వినియోగదారుడు బిఎస్ఎన్ఎల్ లో ఓటిటి సేవలను ఎప్పుడు పొందుతాం అని ప్రశ్నించగా.. దీనిపై బిఎస్ఎన్ఎల్ స్పందిస్తూ.. త్వరలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇతర ఓటిటి సేవలు రానున్నాయని తెలిపింది. ప్రస్తుతం దీనిపై కసరత్తు చేస్తున్నామని తెలిపింది.

బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్ కూడా త్వరలో వస్తుందని కంపెనీ పేర్కొంది. తర్వాత సిమ్ కార్డ్ ని మార్చాల్సిన అవసరం ఉండదు. జియో, ఎయిర్ టెల్, ఐడియా రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెంచడంతో దేశంలోని సుమారు 55 లక్షలకు పైగా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ లో చేరిన విషయం తెలిసింది. దీని కారణంగా వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక సరసమైన ప్లాన్లను బిఎస్ఎన్ఎల్ తీసుకువస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News