Monday, December 23, 2024

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రత్యేక ప్లాన్..

- Advertisement -
- Advertisement -

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల అనేక చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవి దేశవ్యాప్తంగా కోట్లాది మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. గత కొన్ని నెలల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఇతర టెలికం రీఛార్జ్ ప్లాన్ పెంచడమే. ఇప్పుడు కంపెనీకి 9 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ విజయానికి కారణం దీర్ఘ కాల వ్యాలిడిటీతో సరసమైన ప్లాన్‌లు అందిస్తోంది. ఇందులో 130 రోజుల చెల్లుబాటుతో చాలా చౌకైన ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ జియో, ఎయిర్‌టెల్‌ ప్లాన్ల లాగానే అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత మెసేజ్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్రత్యేక ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 699 ప్లాన్

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ చౌకైన ప్లాన్ రూ. 699కి వస్తుంది. కాగా, ఇది 130 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ప్రతిరోజు రూ.5 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్ కింద.. వినియోగదారుడు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతాడు.

ఇక డేటా గురించి మాట్లాడితే.. ఈ ప్లాన్‌లో ప్రతి రోజు 0.5GB హై-స్పీడ్ డేటా, మొత్తం 65GB డేటా అందుబాటులో ఉంది. డేటా అయిపోయిన తర్వాత, 40Kbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ఉచిత SMS సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అంటే మీరు ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పంపవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News