Monday, January 27, 2025

రూ.6 కే అపరిమిత కాలింగ్, 2 జీబీ డేటా..

- Advertisement -
- Advertisement -

ఇటీవల ప్రముఖ జియో, ఎయిర్ టెల్, ఐడియా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొన్నాడు. దీని కారణంగానే అనేక కస్టమర్లు బిఎస్ఎస్ఎన్ఎల్ కు తమ సిమ్ ను పోర్ట్ చేసుకున్నారు. ఈ కంపెనీ వినియోగదారులకు సరసమైన, చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ క్రమంలో బిఎస్ఎస్ఎన్ఎల్ అందించే ఒక అద్భుతమైన ప్లాన్ గురుంచి తెలుసుకుందాం.

రూ.2,399 ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో 395 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందొచ్చు. రోజువారీ లెక్కలను చూస్తే.. ఇది రోజుకు దాదాపు రూ. 6 మాత్రమే పడుతుంది. ఇది చాలా పొదుపుగా ఉంటుంది. అంతేకాకుండా.. ఈ రూ. 2399 ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. కాగా ఇది 395 రోజుల్లో మొత్తం 790GB డేటా వస్తుంది. ఒకవేళ రోజువారీ డేటా పరిమితిని అయిపోతే 40Kbps తక్కువ వేగంతో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయవచ్చు. దీనితో పాటు ప్రతిరోజూ 100 SMSలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ దీర్ఘ కాల వ్యాలిడిటీకి మంచి ఎంపిక.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News