Wednesday, January 22, 2025

బిఆర్ఎస్-బిఎస్ పి మధ్య పొత్తు పొడిచింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిఎస్పీ, బిఆర్‌ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని కెసిఆర్ నివాసానికి వెళ్లిన ఆయన పొత్తులపై చర్చలు జరిపారు.

అనంతరం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బిఎస్పీ, బిఆర్‌ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని సంయుక్తంగా నిర్ణయించారు. బిఎస్పీ, బీఆర్‌ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News