Monday, December 23, 2024

రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై బిఎస్పీ ఫోకస్

- Advertisement -
- Advertisement -
కాంగ్రెస్,బిజెపికి దీటుగా ప్రచారానికి ప్రణాళికలు
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు
గ్రామ స్థాయి నుంచి బలోపేతం కోసం బాధ్యులు నియమాకం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు వివరణ

హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ఇప్పటికే రాజకీయ వ్యుహాలు రచిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎన్నికల సమరానికి కాలు దువ్వుతూ పార్టీలో చేరికలు, ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేస్తూ ఒకరిపై ఒకరి విమర్శలు కురిపిస్తున్నారు. ఈపార్టీల దూకుడుకు మిగతా పార్టీలు కూడా తామేమి తక్కువ కాదని ఎన్నికల పోరుకు సిద్దమైతున్నారు. అందులో భాగంగా జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన అనేక మంది బిసి,ఎస్సీ, ఎస్టీ నాయకులను చట్టసభలోకి పంపిన బహుజన సమాజ్ పార్టీ ఈమూడు పార్టీలకు దీటుగా వ్యుహారచన చేస్తున్నట్లు ఆపార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. ప్రతీసారి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బిఎస్పీ రెండు మూడు చోట్ల విజయం సాధించి తమ ఉనికిని నిలబెట్టుకుంటుంది. ఈసారి అట్టడుగు వర్గాల ఆశజ్యోతి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ బిఎస్సీ పగ్గాలు చేపట్టడంతో పార్టీకి కొత్త బలం చేకూరింది. చాలామంది బడుగు,బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఆపార్టీలో చేరి పార్టీని విస్తరించేందుకు శ్రమిస్తున్నారు. ముందుగా రిజర్వ్ నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు.

రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 19 స్థానాలు ఎస్సీలకు, 12 నియోజకవర్గాలను ఎస్టీలకు కేటాయించారు. వీటిలో పార్టీని బలోపేతం చేసి అన్ని స్ధానాల్లో విజయం సాధిస్తే డిసెంబర్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కీలకపాత్ర ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్పీకి ఎక్కువ శాతం ఓట్లు నమోదైంది ఆ నియోజకవర్గాల్లోనే మరింత దృష్టి సారించి ప్రత్యేక ప్రణాళికలతో ఇతర పార్టీలకు దీటుగా ప్రచారం, జన సమీకరణ వంటి కార్యక్రమాలు చేస్తే రాష్ట్రంలో రెండో అతి పెద్దగా అవతరించే అవకాశముందని పార్టీ నాయకులు బావిస్తున్నారు. రిజర్వేషన్లు స్దానాలు ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ , ఖమ్మంలో సగానికిపై స్దానాలున్నాయి. ముందుగా ఈజిల్లాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.

అందుకోసం ఆపార్టీ చీఫ్ ఆర్‌ఎస్. ప్రవీణ్‌ కుమార్ ఆదిలాబాద్ జిల్లాలో యాత్ర చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగడుతూ బహుజనులకు రాజ్యాధికారం బిఎస్పీతో సాధ్యమని ఈఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టాలని కోరుతున్నారు. 70 ఏళ్లుగా అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని ఇప్పటి నుంచి తమ ఓట్లు మనమే వేసుకుని చట్ట సభలకు వెళ్లి హక్కులు సాధించుకోవాలని సూచిస్తున్నారు. త్వరలో రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో గ్రామ స్ధాయి, మండల స్ధాయి, మున్సిపాలిటీ, జిల్లా స్దాయి కమిటీలు వేసి చురుకైన కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించేందుకు రాష్ట్ర కమిటీ నాయకులు కసరత్తు చేస్తున్నట్లు ద్వితీయ శ్రేణి నాయకులు వెల్లడిస్తున్నారు. ఆదివాసీ, గిరిజనులతో మమేకం అయ్యేందుకు పార్టీ కొత్త ప్రణాళికా సిద్దం చేసిందని త్వరలో బహిరంగ సభలు, మండల స్దాయిలో పాదయాత్రలు చేయనున్నట్లు తెలిపారు. ఊరువాడ తిరిగి ఇప్పటివరకు దళిత, బలహీనవర్గాల ప్రజలను అగ్రకులాల ఏవిధంగా మోసం చేస్తున్నాయో వారి కుట్రలను వివరిస్తామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News